నాకు కెరీర్ పరంగా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ నటిగా మాత్రం పూర్తి సంతృప్తి ఉంది. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్‌తో కలిసి నటించడం నాకు మంచి అనుభవం, గౌరవం. నేను అవకాశాల కోసం పరుగులు తీసే వ్యక్తిని కాదు; మంచి కథ, మంచి సినిమా అయితే అది నాకొస్తుందనే నమ్మకం ఎప్పుడూ ఉంటుంది. యూఎస్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు కేరళలోని నా నేటివ్ ప్లేస్‌కు వెళ్లకుండా నేరుగా హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఈ నగరం నాకు రెండో ఇల్లుగా మారింది. మలయాళంలో పృథ్వీరాజ్ గారి ఆడుజీవితం కోసం ఆడిషన్ చేసినా ఆ సినిమా చేయడం సాధ్యపడలేదు. కానీ మంచి అవకాశం వస్తే మలయాళంలో తప్పకుండా పనిచేస్తా. ఇప్పుడు దీక్షిత్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అతను పూర్తిగా డెడికేషన్ ఉన్న నటుడు. మా కాంబినేషన్ సీన్ల కోసం ఇద్దరం బాగా ప్రిపేర్ అయి నటించాం కాబట్టి ఆ సీన్లు సహజంగా వచ్చాయి.
- November 14, 2025
0
21
Less than a minute
You can share this post!
editor

