కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ ప్రారంభం

కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ ప్రారంభం

కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరిని ఆకట్టుకున్న మోనాలిసా ఇప్పుడు తెలుగు కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి “లైఫ్” అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. “లైఫ్” సినిమా బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో చిత్ర ప్రారంభం చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేశారు, మరియు శివన్నారాయణ గౌరవ దర్శకుడిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత అంజన్న మాట్లాడుతూ, ఈరోజు సినిమాను ప్రారంభించామని, అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ సరికొత్త ప్రయోగంతో లైఫ్ సినిమా అధికారంగా మొదలైంది.

editor

Related Articles