విజయేందర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన మిత్రమండలి సినిమా కామెడీ డ్రామా నేపథ్యంలో రాగా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. టాలీవుడ్‌లో దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాల్లో ఒకటి మిత్రమండలి. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్‌ఎం హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మిత్రమండలి సినిమా నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. అయితే కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాకు ఓటీటీలో సినిమా లవర్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. మిత్రమండలి సినిమాను బన్నీవాస్ సమర్పణలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు. కీవర్డ్స్: మిత్రమండలి ఓటీటీ రిలీజ్, మిత్రమండలి అమెజాన్ ప్రైమ్, ప్రియదర్శి మిత్రమండలి, మిత్రమండలి సినిమా రివ్యూ, మిత్రమండలి నవంబర్ 6 స్ట్రీమింగ్..
- November 5, 2025
0
7
Less than a minute
You can share this post!
editor

