ముంబైలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో సమంత కొత్త లుక్‌లో దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏడాదిన్నరగా కొత్త సినిమాలు చేయని సమంత రూత్ ప్రభు ఇటీవల తన సొంత బ్యానర్‌లో ‘మా ఇంటి బంగారం’ సినిమాను ప్రారంభించింది. అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకున్న సమంత, ఇప్పుడు మళ్లీ ఫిట్‌గా మారి వ్యాపార రంగంలోకి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ‘పిరిల్ బాల్’ బ్రాండ్‌కు స్పాన్సర్‌గా మారిన ఆమె, ఈ ఏడాది తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘శుభం’ అనే సినిమాను నిర్మించి విజయం సాధించింది. తాజాగా సమంత పర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. సొంతంగా ఒక బ్రాండ్‌ను స్థాపించి, తానే దానికి బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తూ మంగళవారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఆ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. బ్లాక్ ఔట్‌ఫిట్‌లో సమంత అందరినీ ఆకట్టుకోగా, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు “ఏజ్ పెరిగినా సమంత మరింత గ్లామరస్‌గా మారుతోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
- November 5, 2025
0
10
Less than a minute
You can share this post!
editor

