దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే, దీనిని కల్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’తో పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. దీనిపై తాజాగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ, “అర్జున్ రెడ్డి ఒక కల్ట్ సినిమా, అది పరిశ్రమకు గేమ్ ఛేంజర్. మా సినిమా దానికి దగ్గరగా కూడా లేదు. ఇది ఒక చిన్న సినిమా. మేము ట్రైలర్‌ను నాన్-లీనియర్ స్టైల్లో కట్ చేయడం వల్లే కొంతమందికి ఆ వైబ్ వచ్చి ఉండవచ్చు. కానీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ పూర్తిగా వేరు కథ” అని తెలిపారు. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
- November 5, 2025
0
47
Less than a minute
You can share this post!
editor

