తాజాగా 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఛైర్పర్సన్ ప్రకాష్‌రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024 నుండి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి ఆయన ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. తాజాగా జాతీయ అవార్డులపై కూడా వైరల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ, “నేషనల్ అవార్డుల విషయంలో జ్యూరీ మెంబర్స్ రాజీ పడుతున్నారని చెప్పడానికి నేను భయపడను. కేరళ స్టేట్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించడం నాకు సంతోషంగా ఉంది. కమిటీవారు నాకు ఫోన్ చేసి, కేరళకు చెందినవారు కాకుండా బయటి వ్యక్తులు, నటనలో అనుభవం ఉన్నవారు జ్యూరీ ఛైర్మన్‌గా ఉండాలని కోరారు. దాంతో నేను అంగీకరించాను. కమిటీ సభ్యులు అవార్డుల ఎంపిక విషయంలో జోక్యం చేసుకోబోమని, పూర్తి స్వేచ్ఛ ఇస్తామని మొదటి రోజే చెప్పారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేందుకు వాళ్లు తీసుకున్న నిర్ణయం నచ్చి అంగీకరించాను. కానీ జాతీయ అవార్డుల విషయంలో అలా జరగడం లేదు. కొందరికి మాత్రమే అవార్డులు వస్తున్నాయి,” అంటూ వ్యాఖ్యానించారు.
- November 4, 2025
0
3
Less than a minute
You can share this post!
editor

