బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశ‌..

బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశ‌..

బాలకృష్ణ ఎప్పుడూ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనదైన మాస్ స్టైల్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అదే విజయాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కుతోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘అఖండ 2’తో పాటు బాలయ్య తదుపరి ప్రాజెక్ట్ ‘NBK 111’ కి సంబంధించిన‌ వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘వీర సింహారెడ్డి’ తర్వాత మళ్లీ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణతో జట్టు కట్టబోతున్నారు.

editor

Related Articles