లోకేష్ కనగరాజ్‌తో రొమాన్స్‌కు సిద్ధమైన వామికా గబ్బి.

లోకేష్ కనగరాజ్‌తో రొమాన్స్‌కు సిద్ధమైన వామికా గబ్బి.

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా తెరంగేట్రం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. కూలీ సినిమాతో హిట్టు అందుకున్న లోకేష్ ప్ర‌స్తుతం డైరెక్ష‌న్‌ని దూరం పెట్టి న‌ట‌న‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ‘రాకీ’, ‘సాణి కాయిదం’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా. తాజాగా ఈ సినిమాలో న‌టించిన హీరోయిన్ గురించి అప్‌డేట్ విడుద‌లైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ యువ నటి వామికా గబ్బి ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనుండ‌గా.. ఈ ప్రాజెక్టును సన్ పిక్చర్స్, లోకేష్‌కి చెందిన‌ జీ స్క్వాడ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

editor

Related Articles