బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ మరోసారి తన సమాధానంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో చేసిన అద్భుత నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఈ విజయం వెనుక నిజమైన ప్రతిభ లేదని, అవార్డులు “కొనుక్కుంటారని” ఓ సినీ విమర్శకుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ క్రిటిక్ అభిషేక్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “ఎవరూ చూడని సినిమాకు అవార్డు ఎలా వస్తుంది?” అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ వర్గాలు కూడా చర్చించసాగారు. నేను కష్టపడి పనిచేయడం, చెమట చిందించడం, కన్నీళ్లే నాకు తెలుసు. ఇదంతా గౌరవ పూర్వకంగానే చెబుతున్నాను అని అభిషేక్ బచ్చన్ బదులిచ్చారు. అభిషేక్ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులు ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. “ఇదే నిజమైన బచ్చన్ వారసుడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
- October 30, 2025
0
28
Less than a minute
You can share this post!
editor

