అస్స‌లు గుర్తు ప‌ట్టలేనంతగా మారిన రవళి..!

అస్స‌లు గుర్తు ప‌ట్టలేనంతగా మారిన రవళి..!

తెలుగు సినీప్రియులకు రవళి దాదాపు రెండు దశాబ్దాలపాటు మెరిసిన ఈ నటి స్టార్ హీరోలతో కలసి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. 1990లో మలయాళ సినిమా ‘జడ్జిమెంట్’ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన రవళి, తదుపరి ఏడాది ‘జయభేరి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా, ‘పెళ్లి సందడి’ సినిమాతో రవళి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ‘ఒరేయ్ రిక్షా’, ‘వినోదం’, ‘చిన్నబ్బాయి’, ‘ముద్దుల మొగుడు’, ‘శుభాకాంక్షలు’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత కాలక్రమేణా ప్రధాన పాత్రల అవకాశాలు తగ్గడంతో రవళి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటించింది. 2007లో ఆమె నీలికృష్ణను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

editor

Related Articles