తమిళ సినీ ఫ్యాన్స్‌కు శుభవార్త. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోంది. చాలా కాలంగా ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే తెరపై కనిపించాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కలయికలో సినిమా రూపుదిద్దుకోబోతోందనే వార్తపై అధికారిక సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి దర్శకుడి పేరు, షూటింగ్ ప్రారంభం వంటి వివరాలు బయటకు రాలేదు. మొదట్లో ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రదీప్ రంగనాథన్ పేరు వినిపించింది. కానీ తాను ఈ ప్రాజెక్ట్‌లో లేనని ప్రదీప్ స్పష్టం చేశారు. దీంతో సినిమా తీస్తారా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.అయితే తాజాగా రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని ధృవీకరించారు. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో సినిమా తప్పకుండా తెరకెక్కుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు.
- October 27, 2025
0
38
Less than a minute
You can share this post!
editor

