మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఆయన రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 హిట్ కావడంతో సినీ పరిశ్రమలో చిరు మళ్లీ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమాకి మంచి స్పందన రాకపోవడం, గాడ్ ఫాదర్ సినిమా అంచనాలు అందుకోకపోవడం ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. ఆ తరువాత వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినప్పటికీ, భోళా శంకర్ నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత దాదాపు ఏడాది పాటు చిరంజీవిని వెండి తెరపై చూడడం సాధ్యం కాలేదు. కొన్నాళ్లుగా విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు చిరు. ఈ సినిమా 2026 సమ్మర్‌కు రానుంది.. గ్రాఫిక్స్, కొన్ని రీ-షూట్‌లు కారణంగా రిలీజ్ ఆలస్యం అయింది. ఏదేమైన సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి కాగా, చిన్న ప్యాచ్ వర్క్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
- October 26, 2025
0
30
Less than a minute
You can share this post!
editor

