బైకును ఢీకొట్టి ఉడాయించిన దివ్య సురేష్‌పై కేసు.

బైకును ఢీకొట్టి ఉడాయించిన దివ్య సురేష్‌పై కేసు.

కన్నడ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివ్య సురేష్‌పై హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో బైను ఢీకొట్టిన ఆమె.. కారు ఆపకుండానే వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ యువతి కాలు విరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దివ్య సురేష్‌పై కేసు ఫైల్‌ చేశారు. ఆమెను విచారించి, కారును సీజ్‌ చేశారు. బిగ్‌బాస్‌-8 పోటీదారు అయిన దివ్య ఈనెల 4న అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో కారులో వెళుతోంది. అదే సమయంలో కిరణ్, అనుషా, అనిత కలిసి బైకుపై దవాఖానాకు వెళ్తున్నారు. కుక్కలు మొరగడంతో భయ పడిన కిరణ్‌ బైకును కొద్దిగా కుడివైపు తిప్పాడు. అయితే వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేష్‌ కారు.. వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కింద పడ్డారు. అనిత మోకాలు వద్ద ఫ్రాక్చర్‌ అవగా, మిగిలిన ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. బాధితులు మొత్తుకున్నప్పటికీ కారు ఆపకుండానే దివ్య అక్కడి నుండి పారిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా అది దివ్య సురేష్ కారుగా గుర్తించారు. ఆమెను విచారించి కారును సీజ్‌ చేశారు.

editor

Related Articles