Movie Muzz

విడాకులపై సమంత స్పందించింది..!

విడాకులపై సమంత స్పందించింది..!

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా సాగినా, ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం అనుకున్నంతగా లేదు. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ వివాహం చివరకు విడాకులకు దారి తీసింది. ఇక తన జీవితంలోని కష్టాలు, ఎదురుదెబ్బల గురించి సమంత రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని. తనను ఇష్టపడని వారు తన కష్టకాలంలో నవ్వుకున్నారని ఆమె తెలిపింది. తాను విడాకులు తీసుకున్న సమయంలో కొందరు సంబరాలు జరుపుకున్నారని.. అయితే, తాను ఇప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవడం లేదని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

editor

Related Articles