Movie Muzz

నిన్న ఓజీ.. ఇప్పుడు ‘అఖండ 2’ .. తమ‌న్..

నిన్న ఓజీ.. ఇప్పుడు ‘అఖండ 2’ .. తమ‌న్..

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమ‌న్ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ వంటి సినిమాలకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు, మాస్ బీట్స్ పెద్ద హిట్ అయ్యాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’కి కూడా తమన్ అద్భుతమైన ట్యూన్స్, బీట్స్ అందించి, ఆడియన్స్‌ను మంత్రముగ్దులని చేశాడు. ‘ఓజీ’లో పవన్ ఎంట్రీ సీన్స్‌లో ఆయన సౌండ్ ఇచ్చిన BGM భారీగా వైరల్ అయింది. తాజాగా తమన్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. బాలయ్య హీరోగా రూపొందుతున్న‌ ‘అఖండ 2’ కోసం ఆయన మరింత ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా తమ‌న్ త‌న త‌ల‌కి ‘NBK’ అని రాసిన బ్యాండేజ్ కట్టుకుని తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోని చూసిన బాలయ్య అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

editor

Related Articles