సన్యాసం అన్న మాట సరదాకే.. రేణు దేశాయ్

సన్యాసం అన్న మాట సరదాకే.. రేణు దేశాయ్

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా సుపరిచితమైన రేణు, బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కెరీర్‌లో పెద్ద‌గా సినిమాలు చేయ‌ని రేణూ ప‌వ‌న్ నుండి విడిపోయిన త‌ర్వాత ఇద్ద‌రు పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూ జీవితం గ‌డుపుతోంది. ఇటీవ‌ల‌ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేణు సోషల్ మీడియా ద్వారా జంతు సంరక్షణ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను తరచుగా షేర్ చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సన్యాసం తీసుకునే ప్లాన్స్‌ గురించి మాట్లాడినట్లు కొన్ని మీడియా సైట్స్ ప్రచురించడంతో, అభిమానులు షాక్‌ అయ్యారు. అయితే ఈ వార్త‌లు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో రేణూ దేశాయ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. నేను సరదాగా సన్యాసం తీసుకుంటానని చెప్పాను. నా పిల్లలు ఇంకా చిన్నవారే, వారిని వదిలి సన్యాసం తీసుకునే బాధ్యతలేని తల్లిని కాదు” అని ఆమె స్పష్టం చేశారు.

editor

Related Articles