తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అల్లు ఫ్యామిలీ ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. అల్లు రామలింగయ్య వారసుడైన అల్లు అరవింద్ ముగ్గురు కుమారులలో ఒకరైన అల్లు శిరీష్ ఇటీవల నిశ్చితార్థం జరుపుకుని, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం శిరీష్ తన నిశ్చితార్థాన్ని ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద జరుపుకున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాను నైనికాతో నిశ్చితార్థం చేసుకున్నట్లు.. నైనిక చేతిని పట్టుకున్న ఫొటోని షేర్ చేస్తూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ఈ వేడుకలో ఇరు కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. వేడుక నిరాడంబరంగా జరగడం విశేషం. ఇప్పటివరకు తన కాబోయే భార్య విషయంలో సీక్రెట్ పాటించిన శిరీష్, ఈ దీపావళి సందర్భంగా నైనికాను ఫ్యాన్స్‌కు తొలిసారి పరిచయం చేశారు. అల్లు కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగిపోయిన ఈ సందర్భంలో తీసిన ఫ్యామిలీ ఫొటోలో శిరీష్-నైనికా జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. అనుకోకుండా నైనిక ఫొటోని రివీల్ చేయడంతో వెంటనే తన పోస్ట్ డిలీట్ చేసి ఆ తర్వాత తోటి కోడలిని సైడ్ చేసి మరో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్స్ .. స్నేహా రెడ్డి తెలివైనదే అని కామెంట్ చేస్తున్నారు. అయితే అప్పటికే కొందరు నైనిక ఫొటోని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. నైనికా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె అని తెలుస్తోంది. ఆమె కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- October 22, 2025
0
28
Less than a minute
You can share this post!
editor