అలియా భ‌ట్ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు..

అలియా భ‌ట్ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు..

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా తన ఇంట్లో స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి సంబరాలు జరుపుకోగా, ఆ వేడుక ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే క్ష‌ణాల‌లో వైర‌ల్ అయ్యాయి. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ అతిథులు కరీనాకపూర్, కరిష్మాకపూర్, అలేఖ వాణి జైన్, నందనీ తాషా, అనీషా మల్హోత్రా జైన్, నీతూకపూర్ లాంటి స్టార్ ఫ్రెండ్స్. అందరితో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
తన సహనటుడు రణబీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియా భ‌ట్ ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి అయిన కూడా సినిమాల్లో మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ బిజీగా కొనసాగుతోంది. తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగి, భారీ పారితోషకాలను పొందుతున్న ఈ ముద్దుగుమ్మ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం తల్లి అయినా తన ఫిట్‌నెస్, ఫ్యాషన్, అందంతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. నెటిజన్లు “తల్లి అయిన తర్వాత మరింత అందంగా మారింది” అని కామెంట్లు పెడుతున్నారు.

editor

Related Articles