బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి నటించిన ఒక భారీ యాడ్ ఫిల్మ్ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ యాడ్ దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. ఏజెంట్ చింగ్ అటాక్ అనే పేరుతో ఈ యాడ్ విడుదల కాగా.. చింగ్స్ దేశీ చైనీస్ అనే బ్రాండ్ ఈ యాడ్‌ని నిర్మించింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ ఏజెంట్ చింగ్‌గా కనిపించగా.. శ్రీలీల ఏజెంట్ మిర్చిగా.. విలన్‌గా నటించిన బాబీ డియోల్ ప్రొఫెసర్ వైట్ నాయిస్ పాత్రలో కనిపించారు. ఇక ఈ యాడ్‌కి కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు.

- October 18, 2025
0
39
Less than a minute
You can share this post!
editor