మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతవరకు తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన దేవీశ్రీ ప్రసాద్, ఇప్పుడు “ఎల్లమ్మ” సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని బలగం సినిమాతో దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకున్న వేణు తెరకెక్కించనున్నాడు. బలగం సినిమా ఎంత భారీ హిట్ సాధించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ఉత్సాహంతో తెలంగాణ నేపథ్యానికి సంబంధించిన కథతో ఎల్లమ్మ అనే సినిమాని దర్శకుడు వేణు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. “ఎల్లమ్మ” సినిమాకు మొదట నాని హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత నితిన్‌కి అవకాశం దక్కినప్పటికీ, నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించినప్పటికీ, అతనూ ఆ పాత్రను స్వీకరించలేదు. ఇంతలో సడెన్‌గా దేవీశ్రీ ప్రసాద్ పేరు హీరోగా ఖరారు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముంది అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు.

- October 18, 2025
0
51
Less than a minute
You can share this post!
editor