ఏంటి.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంటా..!

ఏంటి.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంటా..!

తాజాగా ఓ హీరోయిన్‌ గర్భవతి అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. మ‌రి ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. స‌ల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, తన అందం, అభినయంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తరువాత పలు హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. అలాగే సౌత్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి ‘లింగ’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. గత ఏడాది సోనాక్షి తన చిన్న‌నాటి స్నేహితుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ పలు ఈవెంట్లలో కలిసి కనిపిస్తూ బాలీవుడ్‌లో ట్రెండింగ్ కపుల్‌గా మారారు. ఇటీవల సోనాక్షి ఓ సినీ ఈవెంట్‌కి హాజరైంది. అయితే ఆమె లూజ్‌ డ్రెస్‌‌లో కనిపించడంతో నెటిజన్లు ఆమె గర్భవతి అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వైరల్‌గా మారాయి. ఈ వార్తలపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. తన భర్త జహీర్‌తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, తాను ప్రెగ్నెంట్ కాదని స్పష్టంగా తెలిపింది. “ఇలాంటి రూమర్స్‌ చదవడం నిజంగా ఫన్నీగా ఉంది. దయచేసి ఊహాగానాలు ఆపండి,” అని ఆమె పేర్కొంది.

editor

Related Articles