బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘దే దే ప్యార్ దే’ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇదే సినిమాకి సీక్వెల్ను తీసుకువచ్చారు మేకర్స్. ‘దే దే ప్యార్ దే 2’ అంటూ ఈ సినిమా నవంబర్ 14 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా నుండి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్లో తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆశీష్ (అజయ్ దేవగణ్) తన మాజీ భార్య (టబు) పర్మిషన్తో పాటు ఆమె కుటుంబం అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ సీక్వెల్లో ఆశీష్ ఆయేషా కుటుంబాన్ని ఎలా పెళ్లికి ఒప్పిస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ.
- October 15, 2025
0
84
Less than a minute
You can share this post!
editor


