ప్రముఖ రంగస్థల కళాకారుడు, హాస్యనటుడు, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ రాజుతాళికోటె సోమవారం గుండెపోటుతో కన్ను మూశారు. విజయపుర జిల్లా సింధగి తాలూకా చిక్కసింధగి గ్రామానికి చెందిన రాజు తాళికోటె (62) నాటక రంగంతో పాటు సినిమాలతో ప్రముఖ నటుడిగా పేరొందారు.
ఆయన అసలు పేరు రాజేసాబ్ మక్తుంసాబ్ యంకంచి. ఉడిపిలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే మణిపాల్ ఆసుపత్రికి సహచర నటులు తీసుకెళ్లారు. అప్పటికే రాజు తాళికోటె మృతి చెందారని డాక్టర్లు చెప్పారు.
