‘లిటిల్ హార్ట్స్’ హీరోకి భారీ ఆఫర్..?

‘లిటిల్ హార్ట్స్’ హీరోకి భారీ ఆఫర్..?

టాలీవుడ్ హీరో మౌళి బంపరాఫర్ కొట్టిన‌ట్లు తెలుస్తోంది.
లాక్‌డౌన్‌లో త‌న వీడియోస్‌తో యూట్యూబ్‌లో అల‌రించిన మౌళి గతేడాది ‘హ్యాష్‌ట్యాగ్ 90ఎస్’ వెబ్ సిరీస్‌తో యూత్ ఐకాన్‌గా మారిన అత‌డు తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలతో మంచి గుర్తింపు పొందాడు. అనంత‌రం హీరోగా తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి భారీ క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా చిన్న బడ్జెట్‌లో తెరకెక్కినా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సక్సెస్‌తో మౌళి మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పెద్ద నిర్మాణ సంస్థలు కొత్త దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి మౌళికి బిగ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. రెండో సినిమాకే రూ.1 కోటి రెమ్యూనరేషన్ ఆఫర్‌గా అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై మౌళి ఇంకా బయట పడలేదు.

editor

Related Articles