హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘క్రిష్’ సినిమాకి మరో సీక్వెల్ రాబో తోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్లు సాధించాయి. ఇప్పుడు క్రిష్-4 కూడా రానున్నట్లు రాకేష్ రోషన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకో విశేషం ఉంది. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటించడమే కాకుండా స్వయంగా ఆయనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దర్శకుడిగా హృతిక్ కు తొలి సినిమా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు మేకర్స్. అయితే ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందనను సంప్రదించినట్లు, ఆమె అంగీకారం తెలిపినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.
త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది చిత్రీకరణను మొదలుపెడతామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ తెలిపారు. 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రష్మిక ఈ సినిమాలో ఉందో లేదో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే!
