మోహన్ లాల్ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది..

మోహన్ లాల్  కొత్త సినిమా టీజర్ వచ్చేసింది..

మలయాళ హీరోగా మోహన్ లాల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘వృషభ’. ఈ సినిమాకు నంద కిషోర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్, ఆశీర్వాద్ సినిమాస్ సమర్పిస్తున్నాయి. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబో తోంది. ఈ సంద‌ర్భంగా సినిమా నుండి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ సినిమా టీజ‌ర్ చూస్తుంటే.. మోహన్ లాల్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నారు. యాక్ష‌న్ తో కూడిన ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటోంది.

editor

Related Articles