‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్ పెట్టిన మేకర్స్..

‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్ పెట్టిన మేకర్స్..

చిన్న సినిమాగా వ‌చ్చి టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న లిటిల్ హార్ట్స్’. ఈ సినిమాపై టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఆదిత్య హాసన్ నిర్మించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ఎంటర్ టైనర్ గా వ‌చ్చి సూపర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈ సినిమా స‌క్సెస్ మీట్ ను గురువారం ఏర్పాటు చేశారు మేక‌ర్స్. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా విజ‌య్ దేవ‌ర‌కొండ రాగా.. బండ్ల గ‌ణేష్, అల్లు అర‌వింద్ ప‌త్యేక అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ వేడుక‌లో బండ్ల గ‌ణేష్ మాట్లాడుతూ.. అల్లు అర‌వింద్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. లిటిల్ హార్ట్స్ సినిమాను ప్ర‌మోట్ చేసి ఇంత పెద్ద హిట్ చేసింది బ‌న్నీ వాసు, వంశీ నందిపాటి అయినా క్రెడిట్ మొత్తం అర‌వింద్ తీసుకుపోతాడు అంటూ సరదాగా బండ్ల గణేష్ మాట్లాడారు.

editor

Related Articles