తనకన్నా తక్కువ వయసు వాళ్లతో డేట్ కు వెళ్లిన హీరోయిన్?

తనకన్నా తక్కువ వయసు వాళ్లతో డేట్ కు వెళ్లిన హీరోయిన్?

అమిషా పటేల్ 50 ఏళ్లు వచ్చినా హాట్ నెస్ లో తగ్గేదేలే అంటోంది. అదిరే అందాలతో అరాచకం సృష్టిస్తోంది. తన వయసుకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్లతో డేట్ కు వెళ్తానంటోంది. సినిమాల్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి. తన హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తోంది బాలీవుడ్ బోల్డ్ బాంబ్ అమీషా పటేల్. తాజాగా ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో తన కెరీర్, డేటింగ్, పెళ్లి చేసుకోకపోవడం గురించి చెప్పింది ఈ హీరోయిన్. తనకు చాలా మ్యారేజీ ప్రపోజల్స్ వచ్చాయని అమీషా చెప్పింది. కానీ పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేయమని చెప్పినందున రిజెక్ట్ చేశానని పేర్కొంది. సినిమాల్లోకి రాకముందే ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను లవ్ చేశానని అమీషా చెప్పింది. కానీ పెళ్లి తర్వాత యాక్టింగ్ చేయొద్దని కండిషన్ పెట్టినందున బ్రేకప్ చెప్పానంది. ముంబై హీరోయిన్ అమీషా పటేల్ తెలుగులోనూ సినిమాలు చేసింది. నరసింహుడులో తారక్ తో, పరమ్ వీర చక్రలో బాలయ్య బాబుతో ఆడిపాడింది.

editor

Related Articles