నిఖిల్‌ విజయేంద్ర హీరోగా ‘సంగీత్‌’

నిఖిల్‌ విజయేంద్ర హీరోగా ‘సంగీత్‌’

యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘సంగీత్‌’. సాద్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నవీన్‌ మనోహరన్‌, చంద్రు మనోహరన్‌ నిర్మిస్తున్నారు. గురువారం హీరో నిఖిల్‌ విజయేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తాలూకు గ్లింప్స్ ను విడుదల చేశారు. సంగీతమే ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిదని, ఫీల్ గుడ్‌ ఎంటర్ టైనర్ గా మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని, ప్రేక్షకుల్ని సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిదని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాకి కళ్యాణ్‌ నాయక్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

editor

Related Articles