క‌ల్కి 2 నుండి తప్పుకున్న దీపికా పదుకొణె..

క‌ల్కి 2 నుండి తప్పుకున్న దీపికా పదుకొణె..

టాలీవుడ్ నుండి రాబోయే పెద్ద సినిమాల్లో క‌ల్కి 2 ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా క‌ల్కి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబో తోంది. ప్ర‌భాస్ ఈ సినిమాలో హీరోగా న‌టించ‌గా.. దీపికా పదుకొణె, దిశా ప‌టాని హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాకు పార్ట్ 2 త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ను చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ ప్రాజెక్ట్ నుండి బాలీవుడ్ న‌టి దీపికా పదుకొణె త‌ప్పుకున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది. క‌ల్కి 2 సినిమాలో దీపికా పదుకొణె నటించడం లేదని అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తన పార్ట్ నర్ షిప్‌ నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్‌1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు.

editor

Related Articles