షారుఖ్ ఖాన్ కొడుకు సినిమా ప్రీమియర్ లో తారలు..

షారుఖ్ ఖాన్ కొడుకు సినిమా ప్రీమియర్ లో తారలు..

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విషయం తెలిసిందే. ఆర్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న తాజా వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’. కిల్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న న‌టుడు లక్ష్య ఈ సినిమాలో హీరోగా న‌టించ‌బోతుండ‌గా.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌, రాజ‌మౌళి, అమీర్ ఖాన్‌ అతిథి పాత్ర‌లో కనిపించ‌బోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబ‌ర్ 18 నుండి నెట్ ఫ్లిక్స్ వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ముంబైలో ప్రీమియర్ ను ప్ర‌ద‌ర్శించారు మేక‌ర్స్. అయితే ఈ ప్రీమియర్ కు బాలీవుడ్ తార‌ల‌తో పాటు ముఖేష్ అంబానీ దంప‌తులు, త‌దిత‌ర రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌చ్చి సంద‌డి చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం వైరల్ అయ్యాయి.

editor

Related Articles