లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సినిమాల్లో హీరో తేజ సజ్జ, రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన “మిరాయ్” కూడా ఒకటి. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుండగా ఈ సినిమాని లేటెస్ట్ గా నటసింహ బాలయ్య అలాగే తన వారసుడు మోక్షజ్ఞ తేజతో చూడడం జరిగింది. హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ లో బాలయ్య, మోక్షజ్ఞతో సహా ఇతర కుటుంబీకులు కలిసి చూశారు. మరి దీనిపై పలు విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా మంచు మనోజ్, శ్రియ శరన్ లు సాలిడ్ రోల్స్ చేశారు.

- September 17, 2025
0
3
Less than a minute
You can share this post!
editor