ఓటిటి నుండి అజిత్ సినిమా స్టాప్!

ఓటిటి నుండి అజిత్ సినిమా స్టాప్!

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన రీసెంట్ హిట్ సినిమాయే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. అజిత్ వీరాభిమాని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాని వేరే లెవెల్ ఫ్యాన్ స్టఫ్ తో నింపేసిన దర్శకుడు వాటితో పాటుగా పలు వింటేజ్ సాంగ్స్ ట్రీట్ కూడా అందించారు. మరి ఇవే వారి కొంప ముంచాయి. ఈ సినిమాలో దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరిచిన పలు సినిమాల పాటలు ఉండడంతో తాను కాపీ రైట్స్ వేసి తమిళనాడు హైకోర్ట్ ని ఆశ్రయించారు. దీనితో ఇళయరాజా సైడ్ తీర్పు అనుకూలంగా రావడంతో అజిత్ సినిమాని దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ నుండి తొలగించినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో వెతికితే ఆ సినిమా మీ దేశంలో చూడలేరు అని కూడా వస్తోంది. మరి మేకర్స్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

editor

Related Articles