బాలీవుడ్ హీరోయిన్ ఇలియానా డి క్రూస్ ప్రస్తుతం సినిమాలకంటే తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇటీవలే ఆమె తన భర్త మైఖేల్ డోలన్ తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ముందు కోవా ఫీనిక్స్ డోలన్ కి జన్మనిచ్చిన ఇలియానా, ఆ తర్వాత ‘కీను రాఫే డోలన్’ కు జన్మనిచ్చారు.
అయితే తన రెండవ గర్భధారణ, ప్రసవ అనుభవాలను ఇలియానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. మొదటి బిడ్డను కన్నప్పుడు అన్నిటికీ అంగీకరించే చేశాను. ఒంటరి మహిళ నుండి అకస్మాత్తుగా మారినట్టు అనిపించింది. ఆ తర్వాత బిడ్డ ఆరోగ్యం ఆలనాపాలనపై దృష్టి పెట్టాను.
కానీ రెండో బిడ్డ పుట్టేటప్పటికి మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. గందరగోళంలో పడ్డాను. దాంతో కష్టంగా అనిపించిందని ఇలియానా పేర్కొంది. స్నేహితులు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి మద్దతు లేకుండా పోయింది. ఏకాంతంలో ఉండడం ఓ సవాల్ అయ్యింది అని ఇలియానా పేర్కొంది. ఇలియానా ప్రస్తుతం విదేశాల్లో నివాసం ఉంటోంది. అక్కడ భర్తతో కలిసి పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తున్నప్పటికీ, ముంబయిని తాను చాలా మిస్ అవుతున్నానని వెల్లడించారు. అక్కడ ఉన్న స్నేహితుల సపోర్ట్, మానసిక స్థైర్యం కోసం పొందిన సహాయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు.
