బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కెరీర్ లో అతిపెద్ద ప్లాప్ గా లాల్ సింగ్ చద్దా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చి, అమీర్ ఖాన్ ను తీవ్రంగా బాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాతో తాను ఎదుర్కొన్న అనుభవాలను అమీర్ బయటపెట్టారు. అమీర్ వెల్లడించిన దాని ప్రకారం.. “దంగల్” సినిమా ఇండియాలో 385 కోట్ల వసూళ్లు రాబట్టింది. లాల్ సింగ్ చద్దాకి కనీసం 100 కోట్లు వస్తుందని ఆశపడ్డాను. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షోకే నెగటివ్ టాక్ రావడం, థియేటర్ల వద్ద ఖాళీ కుర్చీలు కనిపించడం ఆయనను షాక్కి గురిచేసిందట. చివరికి ఈ సినిమా వల్ల దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అమీర్ తెలిపారు. ఈ సినిమా ద్వారా నాగచైతన్య హిందీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఉండటంతో చిరంజీవి వంటి ప్రముఖులకు ప్రీమియర్ షో వేయడంతో సినిమాకి తెలుగులోను గట్టి ప్రచారమే జరిగింది. అయినప్పటికీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..

- September 15, 2025
0
18
Less than a minute
You can share this post!
editor