డైరెక్టర్ ఇళయరాజా తన మ్యూజిక్ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆయనకు ఘనంగా సత్కారం చేసింది. లండన్ లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో, ఎంపీ కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంగీత ప్రేమికులకు మధురానుభూతుల్నిఅందించిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, మ్యూజిక్ ప్రియులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో రజినీకాంత్ చేసిన ఓ సరదా కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “జానీ” సినిమా షూటింగ్ టైమ్ లో మద్యం సేవించిన తర్వాత ఏం జరిగిందో చెప్పి రజనీకాంత్ అందరినీ నవ్వుకునేలా చేశారు. రజినీకాంత్ మాట్లాడుతూ.. “జానీ సినిమా టైమ్ లో నేను, డైరెక్టర్ మహేంద్రన్ రాత్రిళ్లు మందు తాగేవాళ్లం. ఆ టైమ్ లో ఇళయరాజా కూడా మాతో కలిసిపోయేవారు. ఒకసారి సగం బాటిల్ తాగిన తర్వాత ఆయన ఇచ్చిన మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ అసాధారణం. అర్ధరాత్రి 3 గంటల దాకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. మహేంద్రన్ మ్యూజిక్ ఎంతవరకు వచ్చింది అని అడిగితే… మూసుకుని కూర్చో అని చెప్పాడు.

- September 15, 2025
0
21
Less than a minute
You can share this post!
editor