ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకుండా కూడా సినిమా తీసి హిట్ చేయవచ్చని నిరూపితమైంది. ఇటీవల విడుదలైన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఫాంటసీ సినిమా డ్రామా రెండు వారాలకే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేష్ నల్ హీట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మలయాళంలోనూ అరుదైన ఘనత సాధించింది. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 కేరళలో రూ.73 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ‘లోక చాప్టర్ 1: చంద్ర’ అదే రికార్డుల్ని క్రాస్ చేసి రూ.74.7 కోట్లు రాబట్టి, కేరళలో బాహుబలి రికార్డును అధిగమించిన తొలి సినిమా అయ్యింది. ప్రస్తుతం ఇది కేరళలో అత్యధిక వసూళ్లు రాబట్టి నాలుగో స్థానంలో నిలిచింది.

- September 13, 2025
0
33
Less than a minute
You can share this post!
editor