మిరాయ్’ సక్సెస్ మంచు మనోజ్ గుండెల్లో ఆనందాన్ని నింపింది. తన కుటుంబం, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న మనోజ్. తేజ సజ్జా హీరోగా రూపొందిన సినిమా ‘మిరాయ్’. రితిక నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్ గా నటించారు, కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ ను మంచు మనోజ్ తన కుటుంబం, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తన స్నేహితులతో కలిసి స్టెప్పులు వేశారు. తన తల్లి నిర్మల పాదాలకు నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం చూసి ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యారని, గర్వంగా ఫీలయ్యారని మనోజ్ ఓ వీడియో షేర్ చేశారు. తనను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

- September 13, 2025
0
22
Less than a minute
You can share this post!
editor