వరద బాధితులకు షారూఖ్ ఖాన్ తక్షణ సాయం..

వరద బాధితులకు షారూఖ్ ఖాన్ తక్షణ సాయం..

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంజాబ్ అస్తవ్యస్థమైంది. భారీ వ‌ర‌ద‌ల‌తో జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా.. వ‌ర‌ద‌ల తాకిడికి ప‌లువురు చ‌నిపోయారు. వేలాది కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. అయితే వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన వంతు సహాయం అందించారు. తన స్వచ్ఛంద సంస్థ ‘మీర్ ఫౌండేషన్’ ద్వారా వరద బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఛారిటీ సంస్థ అయిన మీర్ ఫౌండేషన్, పంజాబ్ లోని స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి సహాయ కార్యక్రమాలను చేపట్టింది. అమృత్ సర్‌, పాటియాలా, ఫాజిల్కా, ఫిరోజ్ పూర్ వంటి వరద ప్రభావిత జిల్లాల్లోని 1500 కుటుంబాలకు పైగా సహాయ కిట్లను పంపిణీ చేశారు. ఆ కిట్లలో మందులు, ఆహార పదార్థాలు, దోమతెరలు, టార్పాలిన్ షీట్లు, మడతపెట్టే చిన్నపాటి పరుపులు వంటి అత్యవసర వస్తువులను అందించారు. ఈ సహాయంతో బాధితుల తక్షణ ఆరోగ్య, భద్రత, ఆశ్రయం పొందే అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నారు. మ‌రోవైపు వరదలపై స్పందించిన షారుఖ్ ఖాన్ తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని షేర్ చేశారు. ఈ కష్టకాలంలో పంజాబ్ ప్రజలకు నేను అండగా ఉంటాను. వారికి నా ప్రార్థనలతో పాటు ధైర్యాన్ని నెలకొల్పుతాను.

editor

Related Articles