హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషల్ డ్రామా ‘పరదా’ ఇప్పుడు ఓటీటీలోకి సైలెంట్ గా అడుగుపెట్టింది. థియేటర్లలో విడుదలైన నెలరోజుల వ్యవధిలోనే, ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విడుదల సమయంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఫలితంగా నిర్మాతలు ఓటీటీలో త్వరగా విడుదల చేసినట్టు అర్ధమవుతోంది. ఈ సినిమాకు ‘సినిమా బండి’, ‘శుభం’ ఫేం డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హర్షవర్దన్ కీలక పాత్రల్లో నటించారు.

- September 12, 2025
0
24
Less than a minute
You can share this post!
editor