ఏడాదిలో ఐదు సినిమాలు.. అదే సక్సెస్‌ అనుకున్నా..

ఏడాదిలో ఐదు సినిమాలు.. అదే సక్సెస్‌ అనుకున్నా..

ఒకప్పటితో కంపేర్‌ చేస్తే ఇప్పుడు ఎన్నో విషయాల్లో తనలో మార్పు వచ్చిందన్నారు సామ్‌. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మయోసైటిస్‌ వల్ల జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ‌ ఇవ్వాలో అర్థమైంది. దానితో చేసిన ఆ పోరాటం నన్ను ఎంతగానో మార్చేసింది. గతంలో విజయం అంటే గ్యాప్‌ లేకుండా సినిమాలు చేయడం అనుకునేదాన్ని. ఏడాదిలో నేను నటించిన ఐదు సినిమాలు విడుదలైన సందర్భాలున్నాయి. అదే సక్సెస్‌ అని నమ్మి మురిసిపోయేదాన్ని. వరుసగా సినిమాలు చేయాలి, పెద్ద బ్లాక్ బస్టర్స్ లో నటించాలి. టాప్ 10 నటీనటుల లిస్ట్ లో ఉండాలి అని భావించేదాన్ని. బుర్రలో ఎప్పుడూ అదే ఆలోచన. కానీ ఇప్పుడు నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. రెండేళ్లుగా నా సినిమాలు విడుదల కాలేదు, టాప్ 10 లిస్ట్ లోనూ లేను. అలాగే నా దగ్గర రూ.1,000 కోట్ల బడ్జెట్ సినిమాలు లేవు. అయినా నేను ఇప్పుడు ఉన్నంతలో సంతోషంగానే ఉన్నా అని చెప్పారు. ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత మరో సినిమాకి సైన్‌ చేయలేదు. తన సొంత బ్యానర్ లో ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో వచ్చిన ‘శుభం’ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేశారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్ లోనే ‘మా ఇంటి బంగారం’ సినిమా మాత్రమే తన చేతిలో ఉంది.

editor

Related Articles