బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొత్త కొత్త ట్విస్ట్ లతో, చిత్ర విచిత్ర సన్నివేశాలతో ముందుకు సాగుతోంది. సెలబ్రిటీలు – సామాన్యుల మధ్య స్నేహాలు, గొడవలు, నవ్వులు, ఎమోషన్స్ కలగలిపి హౌస్ నే ఉగాది పచ్చడిలా మార్చేశారు. ఈసారి బిగ్ బాస్ ఓ ప్రత్యేకమైన రూల్ పెట్టాడు. సెలబ్రిటీలకు మాత్రం రోజూ అన్నం, సాంబార్, ఆలుగడ్డ కూర మాత్రమే పంపిస్తారు. అదే తినాలి తప్ప వేరే ఆప్షన్ లేదని కండిషన్ పెట్టడంతో వారు విసిగిపోయారు. మరోవైపు సామాన్యులకి అలాంటి కట్టుబాట్లు లేకపోవడంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సెలబ్రిటీ కంటెస్టెంట్ సంజన ఒక్క కప్పు టీ కోసం బ్రతిమాలుకోవడం మొదలు పెట్టింది. “రోజుకు ఆరు టీలు తాగుతాను, ఒక్క టీ అయిన ఇవ్వండి” అని కామనర్స్ ను వేడుకుంది. అయితే వారు ఏమాత్రం కరగలేదు. ఫుడ్ సరిపోకపోవడంతో, చివరికి సంజన చేసేదేమీ లేక ఒక గుడ్డును దొంగచాటుగా తినేసింది. ఆ విషయం బయటపడగానే హౌస్ లో పెద్ద కలకలం రేగింది. కామనర్స్ ఆగ్రహంతో “గుడ్డు ఎవరు దొంగిలించారు?” అని ప్రశ్నించగా, సెలబ్రిటీలు ఎవ్వరూ నోరు విప్పలేదు. దీంతో కామనర్స్ గట్టిగా హెచ్చరించి, ఇకపై టెనెంట్స్ ని హౌస్ లోకి రానివ్వద్దని కండిషన్ పెట్టారు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. భరణి సంజనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “నీ వల్ల మిగతావాళ్లందరికీ పర్మిషన్ లేకుండా పోయింది” అంటూ వాదన మొదలెట్టాడు. ఆ మధ్యలో మాస్క్ మ్యాన్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో, గొడవ “భరణి వెర్సెస్ మాస్క్ మ్యాన్”ల మధ్య జరిగింది.

- September 11, 2025
0
30
Less than a minute
You can share this post!
editor