కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంటా? 

కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంటా? 

టాలీవుడ్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కి తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, తీవ్ర గాయాలపాలయ్యారని నిన్నటి నుండి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ తప్పుడు వార్తలు రాయగా, మరికొన్ని వేదికలు కాజల్ ఇక లేరంటూ షాకింగ్ రూమర్స్ సృష్టించాయి. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ స్వయంగా స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రస్తుతం పూర్తిగా సురక్షితంగా ఉన్నానని స్పష్టం చేశారు. నాకు యాక్సిడెంట్ జరిగిందని, ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇవి నాకు చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి పూర్తిగా అబద్ధం. దేవుని దయవల్ల నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. నిజాలపై, పాజిటివ్ విషయాలపై దృష్టి పెడ‌దాం అని కాజల్ ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ స్టోరీల ద్వారా పేర్కొన్నారు.

editor

Related Articles