నిర్మాతలని ఇబ్బంది పెట్టని జాన్వీకపూర్..

నిర్మాతలని ఇబ్బంది పెట్టని జాన్వీకపూర్..

శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్‌ లో బిజీగా ఉంటూనే, సౌత్ సినిమాల్లోనూ తన మార్క్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో నటించిన “దేవర” సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జాన్వీ, త్వరలోనే రామ్ చరణ్ సరసన “పెద్ది” సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ సినిమాపై జాన్వీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాని బుచ్చిబాబు ప్రత్యేక శ్ర‌ద్ధ‌తో తెర‌కెక్కిస్తుండగా, ఇందులో జాన్వీ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండ‌నుంద‌ని అంటున్నారు. అయితే తాజాగా జాన్వీ గురించి బాలీవుడ్ నటుడు, ఆమె బాబాయ్ అయిన అనిల్ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా హీరోయిన్ షూటింగ్ కు వస్తే, రెమ్యూనరేషన్ కాకుండా, ఆమె ట్రావెలింగ్, హోటల్, ఫుడ్ ఖర్చులతో పాటు, స్టాఫ్, తల్లి, మేనేజర్ల ఖర్చులు అన్నీ నిర్మాతే భరిస్తారు. ఇది ఇండస్ట్రీలో ఓ సాధారణంగా చాలా యేళ్లనుండి వస్తున్న సాంప్రదాయంగా మారిపోయింది. అయితే ఈ విషయంలో జాన్వీ కపూర్ మాత్రం భిన్నంగా ఉంటుందని అనిల్ కపూర్ వెల్లడించాడు. జాన్వీ ఎక్కడికైనా షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫ్లైట్ టికెట్లు తానే భరిస్తుంది. స్టాఫ్ కావొచ్చు, సహాయకులు కావొచ్చు, ఎవ్వరైనా ఆమెతో వస్తే వాళ్ల ఖర్చులు కూడా జాన్వీనే భరిస్తుంది. నిర్మాతలపై ఎలాంటి అదనపు భారం మోపదు. ఆమె అంతా స్వయంగా చూసుకుంటుంది అని అన్నారు అనిల్.

editor

Related Articles