సౌత్ ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ అత్యంత ప్రభావవంతమైన దిగ్గజ నటులు. వీరిద్దరినీ సినిమా రంగానికి పరిచయం చేసిన వ్యక్తి దర్శకుడు కె. బాలచందర్. ఆయన దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. 1985 వరకు వీరు కలిసి 15కి పైగా సినిమాల్లో నటించగా, ఆ తర్వాత మాత్రం కలిసి నటించింది లేదు. వారి కాంబోలో సినిమా రాక దాదాపు 46 ఏళ్లు అయింది. ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న ఆయన ఈ వయస్సులోను చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 2020లో రజినీకాంత్, కమల్ కలిసి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ప్లాన్ చేయగా, అది కరోనా మూలంగా ఆగిపోయింది. అయితే ఆ తర్వాత కమల్ తో లోకేష్.. విక్రమ్ అనే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు. ఇక ఇటీవల రజినీకాంత్ తో కూలీ తీశాడు లోకేష్. 1979 లో వచ్చిన అల్లాఉద్దీన్ అద్భుత దీపం తర్వాత ఇద్దరూ కలిసి నటించలేదు. 80 దశకం నుండి స్టార్ డం అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ కాంబోని కలపడం ఎవరి వల్ల కాలేదు. లోకేష్ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తారని ప్రచారం జరగగా, దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ స్వయంగా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేయడం విశేషం.

- September 8, 2025
0
57
Less than a minute
You can share this post!
editor