SSMB29 టార్గెట్ అన్ని వేల కోట్లా.. 

SSMB29 టార్గెట్ అన్ని వేల కోట్లా.. 

హీరో మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా బాక్సాఫీస్‌ టార్గెట్ ఏకంగా పది వేల కోట్లు అట.. ఈ మాట ఫిల్మ్ వర్గాల్లో హీట్ పెంచేస్తోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా అనే మాట వినిపించేది, కానీ ఈ సినిమా విషయంలో ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అన్నది ఇప్పుడు అధికారికంగా ఖరారైంది. ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుందన్న ఊహాగానాలు ఉన్నా, తాజాగా కెన్యా ప్రభుత్వ అధికారులతో జరిగిన భేటీ త‌ర్వాత ఈ సినిమా 120 దేశాల్లో విడుదల కాబోతున్నట్టు అధికారిక సమాచారం రావడం విశేషం. ఈ సినిమా రూ.1,200 కోట్లతో నిర్మితమవుతోంది అని ఒక వార్త. భారత సినీ చరిత్రలో ఇప్పటివరకు ఈ స్థాయి బడ్జెట్ తో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇంత భారీ బడ్జెట్ పెట్టిన తర్వాత సినిమా ఎంత వ‌సూలు చేస్తుంద‌నే దాని గురించి మాట్లాడుకోవడం సహజం. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం, రాజమౌళి – మహేష్ కాంబో సినిమా టార్గెట్ ఏకంగా 10,000 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం కల కాదు, సాధ్య‌మ‌య్యే ప‌ని అని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టును గ్లోబల్ గా ప్రమోట్ చేయడానికి హాలీవుడ్ ప్రముఖ ఏజెన్సీలతో రాజమౌళి ఇప్పటికే చేతులు కలిపారు. ప్రచార కార్యక్రమాల నుండి విడుదల వరకు అన్ని పనులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో జరగనున్నాయి. ఇది భారతీయ సినిమా పరిశ్రమకు ఒక మైలురాయి కావడం ఖాయం. ‘బాహుబలి’, ‘ఆర్ ఆర్ ఆర్’ ఓ బెంచ్ మార్క్ సెట్ చేయ‌గా, బాహుబలి సిరీస్ కలిపి రూ. 2,500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ రూ. 1,300 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ రెండు సినిమాలు 500 కోట్ల లోపల బడ్జెట్ తో రూపొందాయి. ఈ సినిమాలు అంత భారీ వసూళ్లు సాధిస్తే, రూ. 1,200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న మహేష్ – రాజమౌళి సినిమాకి రూ. 10,000 కోట్లు టార్గెట్ అనడం నిజంగానే సెన్సిబుల్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

editor

Related Articles