శ్రీదేవి సినిమా రీమేక్ చేస్తున్న జాన్వీక‌పూర్..

శ్రీదేవి సినిమా రీమేక్ చేస్తున్న జాన్వీక‌పూర్..

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీక‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పనక్కరలేదు. చూడచక్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ హీరోయిన్ సొంతం. అయితే ఈ హీరోయిన్‌కి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌ పెద్ద హిట్ కూడా రాలేదు. సినిమాల క‌న్నా గ్లామ‌ర్ షోతోనే జాన్వీ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. టాలీవుడ్‌కి దేవ‌ర సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌గా, ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో పెద్ది సినిమా చేస్తోంది. ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకుంది జాన్వీక‌పూర్. మ‌రోవైపు త‌న శ్రీదేవి న‌టించిన సినిమాని జాన్వీక‌పూర్ రీమేక్ చేయ‌నుంద‌ట‌. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైర‌ల్‌ అయ్యింది. నాలుగు ద‌శాబ్దాల క్రితం శ్రీదేవి హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్‌ సినిమా ‘చాల్‌బాజ్‌’. 1989లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమా శ్రీదేవికి కెరీర్‌లో మైలురాయి అయ్యింది. పంకజ్ పరాశర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీదేవి డబుల్ రోల్‌లో నటించింది, ఆమెతో పాటు రజనీకాంత్, సన్నీడియోల్ కీలక పాత్రల్లో నటించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ కలగలసిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా రీమేక్‌పై పనులు మొదలైనట్లు సినీవర్గాల్లో చర్చ న‌డుస్తోంది. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నారని సోషల్ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి.

editor

Related Articles