సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అందాల తార..!

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అందాల తార..!

 బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఇప్పటిదాకా ఎంతో గోప్యంగా సాగింది. కానీ ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్‌లో ఆమె పెళ్లి రహస్యం బయటపడింది. కారణం డైరెక్టర్  ఫరా ఖాన్ చేసిన స‌ర‌దా కామెంట్ అనే చెప్పాలి. ఈ ఈవెంట్‌కి ఫరాఖాన్, నర్గీస్‌తో పాటు ఆమె సన్నిహితుడు టోనీ బేగ్ కూడా రెడ్ కార్పెట్‌పై కనిపించారు. ఈ సందర్భంలో ఫరా, టోనీని ఉద్దేశించి.. క్యాజువల్‌గా “టోనీ.. వచ్చి నీ భార్య పక్కన నిలబడు!” అని చెప్పడంతో, అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. అంటే నర్గీస్ – టోనీ ఇప్ప‌టికే పెళ్లి చేసుకున్నార‌ని, ఈ విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచార‌న్న సంగతి అప్పటికి గానీ తెలియలేదు. న‌ర్గీస్ ఫక్రీ – టోనీ బేగ్‌ల పెళ్లి 2025 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో నిరాడంబరంగా జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి స్విట్జర్లాండ్ హనీమూన్‌కు వెళ్లారు. బాలీవుడ్‌లో ‘రాక్‌స్టార్’ సినిమాతో పరిచయమై తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకున్నారు న‌ర్గీస్ ఫ‌క్రీ. ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’  సినిమాలో నటించి అంద‌రి దృష్టిని ఆకర్షించింది. తెలుగులోనూ పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’లో నటించింది.

editor

Related Articles