వెంకటేష్.. వి.వి.వినాయక్‌.. కాంబినేషన్‌లో ఓ సినిమా..

వెంకటేష్.. వి.వి.వినాయక్‌.. కాంబినేషన్‌లో ఓ సినిమా..

వెంకటేష్ – వి.వి.వినాయక్‌  కలయికలో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. తాజాగా వినాయక్‌, వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని, అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని  తెలిసింది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్‌ చేసి షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది. వెంకీ, వినాయక్‌ కాంబోలో వచ్చిన లక్ష్మీకి ఆకుల శివ కథ అందించారు. మరోసారి వెంకటేష్ కోసం ఆయనే కథని సిద్థం చేశారు. వి.వి.వినాయక్‌ తన తరహా మాస్‌, కామెడీ జానర్‌ని గుర్తు చేసేలా కామెడీకి కాస్త యాక్షన్‌ జోడించి ఈ స్ర్కిప్ట్‌ సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ‘లక్ష్మీ’ని నిర్మించిన నల్లమలుపు బుజ్జి నిర్మాణంలోనే ఈ సినిమా ఉండబోతోందని తెలిసింది. తెలుగులో ఇంటెలిజెంట్‌, హిందీ ఛత్రపతి రీమేక్‌ తర్వాత వి.వి.వినాయక్‌ మరో సినిమా చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత వినాయక్  మళ్లీ తనదైన శైలి కథతో రంగంలోకి దిగుతున్నారని తెలిసింది. 

editor

Related Articles