కోలీవుడ్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. శుక్రవారం విశాల్ పుట్టినరోజు సందర్భంగా వీరి నిశ్చితార్థం చెన్నైలోని విశాల్ ఇంట్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట తమ ప్రేమ విషయాన్ని మే నెలలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. నిజానికి ఈరోజు వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. నడిగర్ సంఘం భవన (తమిళ ఫిల్మ్ అసోసియేషన్) నిర్మాణ పనులు పూర్తికావాల్సి ఉన్నందున పెళ్లిని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.

- August 29, 2025
0
63
Less than a minute
You can share this post!
editor